• Home
  • Andhra Pradesh
  • తెలుగు రాష్ట్రాల్లో నానా హడావిడి చేసిన అఘోరీ: NHRCకి విలేకరి ఫిర్యాదు
Image

తెలుగు రాష్ట్రాల్లో నానా హడావిడి చేసిన అఘోరీ: NHRCకి విలేకరి ఫిర్యాదు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అఘోరీ పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. నమ్మకం, భక్తితో గుర్తించే అఘోరీ విధానం మర్చిపోయి, న్యూసెన్స్ సృష్టించిన ఈ అఘోరీ తెరమీదకి వచ్చింది. మంగళగిరి, వరంగల్ వంటి ప్రాంతాల్లో ఈ అఘోరీ తన చేష్టలతో భయభ్రాంతులకు గురిచేసింది.

గత నెల 18న మంగళగిరి ఆటోనగర్ వద్ద కార్ వాష్ సెంటర్‌లో జరగిన ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. విలేకరులు వార్తల కవరేజ్‌కి వెళ్లిన సమయంలో అఘోరీ మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో విలేకరి ఆరేపల్లి రాజు కాలు విరిగింది. బాధితుడు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి (NHRC) ఫిర్యాదు చేశారు.

ఇక వరంగల్ జిల్లా మామునూరు పీఎస్‌లో నవంబర్ నెలలో అఘోరీపై కోడిని బలిచ్చిన కేసు నమోదైంది. పూజలు నిర్వహించిన ఈ ఘటనకు సంబంధించి సెక్షన్ 325 BNS, 11(A) PCCA యాక్టు కింద కేసు నమోదు చేశారు.

సాధారణంగా అఘోరాలు జనంలోకి రాకుండా తపస్సు చేస్తుంటారు. కానీ ఈ అఘోరీ తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల పాటు నానా హడావిడి చేసింది. ప్రస్తుతం ఈ అఘోరీ కనిపించకుండా పోయింది.

 

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply