• Home
  • Movie
  • రాజేంద్ర ప్ర‌సాద్ సినిమాల స‌క్సెస్‌ సీక్రెట్ ఇదేన‌ట‌
Image

రాజేంద్ర ప్ర‌సాద్ సినిమాల స‌క్సెస్‌ సీక్రెట్ ఇదేన‌ట‌

తెలుగు చిత్రాల్లో హాస్య కథానాయకునిగా పేరుతెచ్చుకున్న‌ రాజేంద్రప్రసాద్. తనదైన మార్క్ ను సృష్టించుకుని కామెడీని పరుగులు తీయించారు. రాజేంద్రప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విష‌యాల‌ను వెల్ల‌డించారు.

తాను చిన్నప్పటి నుంచి నేను అల్లరివాడిన‌ని, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయకుండా కొంతకాలం ఖాళీగా తిరిగాన‌ని అన్నారు. ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమాతో ద‌ర్శ‌కుడు వంశీ త‌న‌ను హీరోను చేశార‌న్నారు. ఆ తరువాత ‘లేడీస్ టైలర్’తో హిట్ ద‌క్కింద‌న్నారు. ఆ సినిమా త‌రువాత తాను వెనుదిరిగి చూసుకోలేద‌న్నారు. ఏడాదికి 12 సినిమాలు చేస్తూ వెళ్లాన‌ని, దానిని భగవంతుడు ఇచ్చిన అవకాశంగానే నేను భావించాన‌ని రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు.

నాటి నిర్మాతలు .. దర్శకులు .. రచయితలు త‌న‌ కోసం విభిన్నమైన పాత్రలను సృష్టించార‌న్నారు. అవి రెగ్యులర్ హీరోల పాత్రలు కాద‌ని, సమాజంలో కనిపించే పాత్రలనే తెరపై చేశాన‌న్నారు. ‘అప్పుల అప్పారావు’ .. ‘పేకాట పాపారావు’ అలాంటి చిత్రాలేనని అన్నారు. ఆ పాత్రలు అందరికీ కనెక్ట్ అయ్యాయ‌న్నారు. చిన్న బడ్జెట్ లు … పెద్ద హిట్లు అన్నట్టుగా త‌న‌ కెరియర్ కొనసాగింద‌ని పేర్కొన్నారు. ప్రేక్షకులు తమ ఇంట్లో ఒకరిగా త‌న‌ను భావించడం వల్లనే, తాను ఇంతకాలం పాటు నేను సినిమాలు చేయగలిగాన‌ని రాజేంద్ర ప్ర‌సాద్ తెలిపారు.

Releated Posts

మహేష్ బాబు చేయాల్సిన సినిమా దక్కించుకున్న రామ్ చరణ్…!!

సినీ పరిశ్రమలో ఒక కథ మరో హీరోకి వెళ్ళడం సాధారణమే. కానీ కొన్నిసార్లు అది ఒకరి కెరీర్‌ను మలుపు తిప్పే విధంగా మారిపోతుంది. అలాంటి…

ByByVedika TeamApr 19, 2025

షైన్ టామ్ చాకో అరెస్ట్ – డ్రగ్ కేసులో కీలక మలుపు..!!

ప్రముఖ నటుడు మరియు ‘దసరా’ విలన్‌ షైన్ టామ్ చాకో ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. రెండు రోజులుగా హోటల్ నుంచి తప్పించుకుని…

ByByVedika TeamApr 19, 2025

కేఎల్ రాహుల్ కుమార్తెకు నామకరణం: “ఇవారా” అర్థం ఏమిటి?

భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 24న వీరిద్దరికీ ఓ…

ByByVedika TeamApr 18, 2025

మ్యాడ్ స్క్వేర్ థియేటర్ హిట్‌ తర్వాత ఓటీటీలోకి..??

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో మ్యాడ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించిన ఈ యువతరానికి…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply