ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జల్‌పల్లిలోని తన ఇంటికి వచ్చిన మనోజ్‌ను తన ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వార్తలు సేకరించేందుకు వచ్చిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై మోహన్ బాబు ఆగ్రహంతో దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా, మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
కాగా తన మనవరాలిని చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్‌లో మోహన్ బాబు పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరుపు లాయర్ వాదనలు వినిపించారు. అయితే, హైకోర్టు న్యాయమూర్తి మోహన్‌బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని కోరారు. గాయపడిన జర్నలిస్ట్ రంజిత్ స్టేట్‌మెంట్‌ను జీపీ కోర్టుకు సమర్పించారు. వాదనల అనంతరం బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మోహన్‌బాబు- మనోజ్ మధ్య వివాదంపై ఇప్పటికే పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మోహన్‌బాబు డిసెంబర్ 24వ తేదీ వరకు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.