సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు, తన కుమారుడు మనోజ్ చేసిన తీవ్ర ఆరోపణలను తిప్పి కొడుతూ ఓ ఆడియో విడుదల చేశారు. ఈ ఆడియోలో ఆయన తన కుమారుడు, కోడలిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇందులో ఆయన గత మూడు రోజులుగా జరుగుతున్న గొడవలపై తన గుండె నిండా ఉన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన ఈ గొడవలను, తన మనసులో ఉన్న బాధను వెల్లడిస్తూ, తన కుటుంబం, ఆస్తి విషయంలో జరిగిన వివాదాలపై వివరణ ఇచ్చారు.
జల్‌పల్లి ఇల్లు నా కష్టార్జితం
మోహన్ బాబు, తెలుగు సినిమా పరిశ్రమలో తన కృషి, పట్టుదలతో ఎదిగారు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా తానేమిటో నిరూపించుకున్నారు. ఈ వివాదంపై ఆయన స్వయంగా తన మనసులోని బాధను, ఆవేదనను ఒక ఆడియోలో వ్యక్తం చేశారు. దీనిలో మొదటగా మోహన్ బాబు తన ఆస్తి విషయమై ప్రస్తవిస్తూ, మనోజ్ పై తన అభిప్రాయాలను వెల్లడించారు. తన తండ్రి తనకు ఏ విధమైన ఆస్తి ఇవ్వలేదని, తాను కష్టపడి సంపాదించుకున్నానని, జల్‌పల్లి ఇల్లు కూడా తన కష్టార్జితమేనన్నారు. ఇది నా జీవితం, నా కలలు. ఈ ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదని మోహన్ బాబు అన్నారు. తన కుమారుడి ప్రవర్తించిన తీరుపై ఆవేదనను వ్యక్తం చేస్తూ, తనకు, మనోజ్‌కు మధ్య కొన్ని ఘర్షణలు జరిగాయన్నారు. “ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి.
మంచు మనోజ్ మద్యానికి బానిస మారాడని చెప్పారు. మనోజ్ మద్యం మత్తులో అర్థరహితంగా ప్రవర్తించేవాడని. దీనిని గుర్తంచి మనోజ్‌కు బుద్ధి చెప్పాలనుకున్నామన్నారు. మనోజ్‌ను ఎంతో కష్టపడి పెంచానన్నారు.
ఆస్తి పంపకాలను నా ఇష్టం మేరకే జరుగుతాయి
మోహన్ బాబు తన ఆస్తి గురించి మాట్లాడుతూ తన ఆస్తి విషయంలో తాను నిర్ణయం తీసుకుంటానని, ముగ్గురికి సమానంగా ఆస్తులు ఇవ్వాలా లేదా, దానధర్మాలు చేయాలా, అనేది తానే చేస్తానని, తన ఇంట్లో అడుగు పెట్టడానికి ఎవరికీ అధికారం లేదన్నారు. మోహన్ బాబు తన కుమారుడు మనోజ్ చేసిన విమర్శలపై భావోద్వేగాని గురయ్యారు. నీ వల్ల నీ అమ్మ ఆసుపత్రిలో చేరిందని, ఈ విషయంలో చాలా బాధగా ఉందన్నారు. భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావని మోహన్ బాబు అన్నారు. మీ అన్న విష్ణును చంపుతావని బెదిరించావని గుర్తుచేశారు. ఇక, ఈ గొడవలకు ముగింపు పలుకుదాం. అందరం శాంతంగా ఉందామని మోహన్ బాబు ఆ ఆడియోలో పేర్కొన్నారు. ఈ ఆడియోలో మోహన్ బాబు తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేశారు.