మంచు ఫ్యామిలీ గొడవకు కొత్త మలుపు తీసుకొచ్చింది తల్లి మంచు నిర్మల వ్యాఖ్యలు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి గొడవలు జరగలేదని, అప్పుడు జరిగిన సంఘటనలపై స్పష్టతనిచ్చారు.
తన చిన్న కొడుకు మంచు మనోజ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఇంట్లోని జనరేటర్‌లో మంచు విష్ణు పంచదార పోశారనే ఆరోపణను ఖండించారు. తన పుట్టినరోజు వేడుకలకు మాత్రమే విష్ణు వచ్చాడని, కేక్ కట్ చేశాక తన సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాడని వెల్లడించారు.

తల్లి మంచు నిర్మల వివరాల్లోకి వెళితే, “ఇంట్లో మనోజ్‌కు ఎంత హక్కు ఉందో, విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదు. అంతేకాదు, ఇంట్లో పనిచేసే పనివాళ్లు మానేయడానికి కూడా విష్ణు కారణం కాదని స్పష్టంగా చెప్పగలను. వాళ్లే పనిచేయలేమని చెప్పి మానేశారు,” అని పేర్కొన్నారు.













