Vedika Media

Vedika Media

vedika logo

నటుడు బెహరా ప్రసాద్ అరెస్ట్‌

ప్రముఖ తెలుగు యూట్యూబ్ నటుడు బెహరా ప్రసాద్‌ను హైదరాబాద్ న‌గ‌రంలోని జుబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర నటిని వేధించిన కేసులో పోలీసులు బెహరా ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు బెహరా ప్రసాద్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంత‌రం ప్రసాద్‌ను కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి బెహరా ప్రసాద్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. అతనిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఓ వెబ్ సిరీస్ షూటింగ్ టైమ్‌లో బెహరా ప్రసాద్ తనకు పరిచయమయ్యాడని, తనతో ఒక‌సారి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జ‌రిగిన‌ కొన్నిరోజుల తర్వాత తాము మరో వెబ్ సిరీస్‌లో కలిసి పని చేశామని, ఆ సమయంలో కూడా అందరిముందు తనతో అసభ్యంగా బిహేవ్ చేశాడ‌ని తెలిపింది. దీనిపై ప్రశ్నిస్తే తీవ్రంగా దూషించాడని, ఈ నెల 11న షూటింగ్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అందరి ముందే తనపై దాడి చేశాడని బాధితురాలు త‌న ఫిర్యాదులో పేర్కొంది.

Leave a Comment

Vedika Media