తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌కు ఈ నెల 31తో కాలం చెల్లిపోనుంది. దీని స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
భూభారతి పోర్టల్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నిర్వహించనుంది. ప్రస్తుతం ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న టెర్రాసిస్ సంస్థ, తన వద్ద ఉన్న మొత్తం డేటాను ఎన్ఐసీకి బదిలీ చేయనుంది. డేటా బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత, భూ రికార్డులపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.