• Home
  • Telangana
  • తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ 2025: తేదీల వారీ పూర్తి వివరాలు
Image

తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ 2025: తేదీల వారీ పూర్తి వివరాలు

తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షలు 2025 మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ విద్యాశాఖ ఈ షెడ్యూల్ గురువారం (డిసెంబర్ 19) విడుదల చేసింది.

2025 పదో తరగతి పబ్లిక్ పరీక్షల పూర్తి షెడ్యూల్:

  • మార్చి 21: ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 22: సెకెండ్ లాంగ్వేజ్
  • మార్చి 24: ఇంగ్లీష్
  • మార్చి 26: మ్యాథమెటిక్స్
  • మార్చి 28: ఫిజికల్ సైన్స్
  • మార్చి 29: బయోలాజికల్ సైన్స్
  • ఏప్రిల్ 2: సోషల్ స్టడీస్

పరీక్షలు గతంలో మాదిరిగానే 80% మార్కులకు జరగనుండగా, 20% మార్కులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నుంచి కలపనున్నారు. 2025-26 నుంచి పబ్లిక్ పరీక్షలు 100 మార్కులకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఈ ఏడాది నుంచి పరీక్ష ఫలితాలను మార్కుల రూపంలో ప్రకటించనున్నారు. గతంలో ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేసి మార్కులను స్పష్టంగా ప్రదర్శించనున్నారు.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply