Vedika Media

Vedika Media

vedika logo

తెలంగాణ అసెంబ్లీ: భట్టి విక్రమార్క Vs హరీష్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం.. రాష్ట్ర అప్పులపై మాటల తూటాలు

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై విస్తృత చర్చ జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో అసెంబ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

హరీష్ రావు మాట్లాడుతూ, “ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం కోటి 27 లక్షల 208 కోట్ల రూపాయల అప్పు చేసింది” అని ఆరోపించారు. ఇది కొనసాగితే వచ్చే ఐదేళ్లలో అప్పు మొత్తం 6 లక్షల 36 వేల కోట్ల రూపాయలు అవుతుందని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇస్తూ, “బీఆర్‌ఎస్ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు,” అని మండిపడ్డారు. ప్రభుత్వ గ్యారంటీ రుణాలు 51,200 కోట్లు మాత్రమే అని భట్టి వివరించారు.

అంతేకాదు, హరీష్ రావు తన ప్రసంగంలో భట్టి విక్రమార్కను “డిప్యూటీ స్పీకర్” అని పొరపాటుగా సంబోధించి ఆసక్తికరమైన పరిస్థితి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హరీష్ రావు, “భట్టి సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను,” అని అన్నారు.

అప్పులపై ప్రత్యేక చర్చకు సవాలు విసిరిన భట్టి, “బీఆర్‌ఎస్ సిద్ధమా?” అని ప్రశ్నించారు. దీనికి స్పందనగా హరీష్ రావు “సిద్దమే” అని సవాలు స్వీకరించారు.

అదే సమయంలో, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లగచర్ల రైతు ఘటనపై నిరసన తెలుపుతూ నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు.

Leave a Comment

Vedika Media