యువర్ అటెన్షన్ ప్లీజ్..!
మీకు శనివారం ఎలాంటి ముఖ్యమైన పనులు ఉన్నా, వాటిని మధ్యాహ్నానికి ముందుగానే పూర్తి చేసుకోండి. ఈ హెచ్చరిక కేవలం హైదరాబాద్ పబ్లిక్‌కే కాదు, తెలంగాణా వాసులకే కాదు, ప్రపంచమంతా శాస్త్రవేత్తలు అందించిన కీలక సూచన.
ఈ రోజు ప్రజలు ఒక కొత్త అనుభూతిని పొందబోతున్నారు. సాధారణంగా రోజులో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటాయి. కానీ డిసెంబర్ 21, 2024 అంటే ఈ రోజు, ప్రపంచం అత్యంత సుదీర్ఘమైన రాత్రిని చూడబోతోంది. రాత్రి 16 గంటల సమయం ఉండబోతుందని, పగలు కేవలం 8 గంటలేనని ప్రచారం జరుగుతోంది.
వింటర్ సోల్స్టీస్ అంటే ఏమిటి?
ఇలా పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉండే పరిస్థితిని “వింటర్ సోల్స్టీస్” అంటారు. ఇది ప్రతి ఏడాది డిసెంబరు 19 నుంచి 23 మధ్యలో ఒకరోజు జరుగుతుంది. ఈ రోజున భూమి దాని ధృవం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. దీని వల్ల:
- సూర్యుని కాంతి భూమికి తక్కువ సమయమే అందుతుంది.
- చంద్రకాంతి ఎక్కువ సమయం భూమిపై కనిపిస్తుంది.
- ఉష్ణోగ్రతలు తగ్గి, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలు:
శనివారం ఉదయం 6:41కి సూర్యోదయం జరిగింది. అయితే, సూర్యాస్తమయం మధ్యాహ్నం 2 గంటలకే జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా? ఈ ప్రకృతి వింతను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిజంగా 16 గంటల రాత్రి ఉంటుందా?
ఇది శాస్త్రవేత్తల అభిప్రాయానికి మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ వింటర్ సోల్స్టీస్ సందర్భంలో అలాంటి ప్రకృతి మార్పులు సాధారణమే. కాబట్టి ఇది కూడా ఒక ఆసక్తికరమైన అనుభవం అవుతుందని భావించవచ్చు