• Home
  • Movie
  • జాకీర్ హుస్సేన్ క‌న్నుమూత‌.. ఆయ‌న జీవితంలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు
Image

జాకీర్ హుస్సేన్ క‌న్నుమూత‌.. ఆయ‌న జీవితంలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు

న్యూఢిల్లీ: ప్ర‌ముఖ త‌బ‌లా వాయిద్య కారుడు జాకీర్ హుస్సేన్ మృతి శాస్త్రీయ సంగీతానికి తీరని లోటు. జాకీర్ హుస్సేన్ వేళ్లు తబలాపై రాగాల దరువులు వేస్తూ సంగీత మాయాజాలాన్ని సృష్టించాయి. అతను తబలా వాద్యకారుడు మాత్రమే కాదు, స్వరకర్త మరియు నటుడు కూడా. జాకీర్ హుస్సేన్‌ భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఒక లెజెండ్. జాకీర్ హుస్సేన్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉస్తాద్ బిరుడు ఎలా వ‌చ్చింది?
దూరదర్శన్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ 1988లో నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు, ఆ క్షణం నాకు చాలా ప్రత్యేకంగా నిలిచింది. నాకు ఆ అవార్డు ఇస్తున్నట్లు తెల్లవారుజామున 4 గంటల‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఓ వ్యక్తి నా ద‌గ్గ‌ర‌కు ఒక వార్తాపత్రికను తీసుకొచ్చాడు, అందులో నేను అవార్డు అందుకోబోతున్నాన‌ని రాసి ఉంది. ఆ రోజుల్లొ నేను జేవియర్స్ కాలేజీలో పండిట్ రవిశంకర్‌తో కలిసి తబలా వాయిస్తున్నాను. ఆరోజు మా నాన్న ఉస్తాద్ అల్లా రఖా నాకు పద్మశ్రీ అవార్డు ఇవ్వ‌నున్నార‌ని తెలిసి ఉద్వేగానికి లోనయ్యారు. ఇంతలో వేదికపై రవిశంకర్ నేను పద్మశ్రీ పొందబోతున్నానని ప్రకటించారు. అప్పుడు నన్ను ఆయ‌న మొదటిసారిగా ఉస్తాద్ అని పిలిచారు. ఆయన వేదిక‌పై మాట్లాడుతూ ఈ అవార్డు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్‌కు లభించింద‌ని పేర్కొన్నారు.

మొదటి కచేరీకి ఎంతిచ్చారు
జాకీర్ హుస్సేన్ చిన్నతనం నుండే తబలాపై వేళ్లతో సంగీత మాయాజాలాన్ని సృష్టించడం ప్రారంభించాడు. మొదటి సంగీత కచేరీ జరిగినప్పుడు, అతని వయస్సు కేవలం 11 సంవత్సరాలు. 12 ఏళ్ల వయసులో జాకీర్ హుస్సేన్ అమెరికాలో ఓ షోలొ పాల్గొన్నారు. అప్పుడు ఆయ‌న‌కు ఐదు రూపాయ‌లు ఇచ్చారు. జాకీర్ హుస్సేన్ ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, ‘నేను నా జీవితంలో చాలా డబ్బు సంపాదించాను, కానీ నాకు మొదటిగా వచ్చిన 5 రూపాయలు చాలా విలువైనవి. అదే నా జీవితంలో మొదటి సంపాదన. కెరీర్‌లో తొలి సంపాదన దక్కిందన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ ఐదు రూపాయలు నాకు విలువైనవి. జాకీర్ హుస్సేన్ సంగీతంతో మాత్రమే ఆగిపోకుండా నటించాడు కూడా. 1983 బ్రిటిష్ చిత్రం హీట్ అండ్ డస్ట్‌లో శశి కపూర్‌తో కలిసి ఒక పాత్రను పోషించారు.

జాకీర్ హుస్సేన్ చివరి వీడియో
జాకీర్ హుస్సేన్ తన చివరి సోషల్ మీడియా సందేశంలో ప్రకృతి అనుభూతి గురించి తెలిపారు. ఈ మెసేజ్‌లో ‘చెట్టు రంగు మారుతోంది, గాలికి మెల్లగా ఊగుతోంది…’ అని చెబుతున్న ఈ వీడియో అక్టోబర్ 29న పోస్ట్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే జాకీర్ హుస్సేన్ తన జీవితంలో మార్పు రాబోతోందని గ్రహించినట్లు తెలుస్తోంది. ఏదో జరగబోతోందని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.

జాకీర్ హుస్సేన్ గజిబిజి జుట్టు వెనుక‌..
జాకీర్ హుస్సేన్ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా అతని గిరజాల జుట్టును చాలామంది ఇష్ట‌ప‌డుతుంటారు. ఒకసారి జాకీర్ హుస్సేన్‌ను తన జుట్టు గురించి మాట్లాడుతూ జుట్టును అలంకరించడం వల్ల సాధించేదేమీ లేదు. చాలామంది జుట్టును అలంకరించుకోవడానికి ఒకటి లేదా రెండు గంటలు వెచ్చిస్తారు. నేను ఎప్పుడూ నా జుట్టు దువ్వుకోలేదు. నేను గత 15-20 సంవత్సరాలుగా నాతో ఒక బ్రష్‌ని తీసుకెళ్తున్నాను, కానీ ఎప్పుడూ దానిని ఉపయోగించలేదు. తలస్నానం చేశాక జుట్టుని ఇలాగే వదిలేస్తాను. ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది మరియు భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంద‌న్నారు.

సంగీతంతో అనుబంధం
జాకీర్ హుస్సేన్‌కు చిన్నప్పటి నుంచి సంగీతంతో ఎంతో అనుబంధం ఉంది. అతని తండ్రి ఉస్తాద్ అల్లా రఖా తబలా ప్లేయర్. జాకీర్ హుస్సేన్‌ సంగీతాన్ని వారసత్వంగా పొందాడు. ఆయ‌న త‌న జీవితంపై జాకీర్ అండ్ హిస్ తబలా థా ధిన్ థా అనే పుస్తకం రాశారు. ఇందులో చిన్నతనంలో జాకీర్ హుస్సేన్ ప్లాట్‌గా ఉండే ఏ ప్లేస్ చూసినా తన చేతివేళ్లతో వాయించేవాడు. కొన్నిసార్లు అతను తన తల్లి చెంపపై కూడా వాయించేవాడు. వంటగదిలోని పాత్రలు కూడా అతని వేళ్లనుంచి తప్పించుకోలేదు. ఈ సమయంలో జాకీర్ హుస్సేన్ ఆహార ప‌దార్థాల‌ను కింద‌ప‌డేసేవాడు. దీంతో జాకీర్‌ను త‌ల్లి కొడుతుండేది. భారతదేశంతోపాటు విదేశాలలో మంచి పేరు పొందిన జాకీర్ హుస్సేన్ 60 సంగీత సేవ‌ల‌ను అందించారు. అంతర్జాతీయ సంగీతకారులతో వేదికపై కూడా తబలా వాయించాడు, తబలాకు జాకీర్ హుస్సేన్ కొత్త గుర్తింపునిచ్చారు.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply