యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ విడాకుల పుకార్లపై చర్చ
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య ఉన్న అనుమానాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, చాహల్ తన ఫొటోలును తొలగించడం వంటి చర్యలతో వీరిద్దరూ విడిపోయారనే ఊహాగానాలు చెలరేగాయి.
చాహల్ ప్రకటన
జనవరి 9న చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేస్తూ, వ్యక్తిగత జీవితంపై అనవసర పుకార్లను వ్యాప్తి చేయవద్దని కోరారు. “నా దేశం, నా జట్టు, నా అభిమానుల కోసం నేను ఇంకా గొప్పగా ఆడాలి,” అని తెలిపారు. వ్యక్తిగత విషయాలపై చర్చలు ఆపాలని విజ్ఞప్తి చేశారు.
ధనశ్రీ ప్రకటన ధనశ్రీ కూడా తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, సోషల్ మీడియాలో ద్వేషంతో తన ప్రతిష్టకు భంగం కలిగించరాదని చెప్పారు. “తన మౌనం బలహీనత కాదని, కష్టపడి ఈ స్థాయికి చేరానని” వివరించారు
విడాకులపై వాస్తవం
చాహల్ ప్రకటనలో తనను కొడుకు, సోదరుడు, స్నేహితుడిగా అభివర్ణించారు కానీ భర్త అని ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ వ్యాఖ్యలు ప్రజలలో మరింత అనుమానాలను రేకెత్తించాయి.
మద్దతు కోరిన చాహల్
“నిజమైన విలువలు, కృషి, నిబద్ధతతో ముందుకు సాగుతాను” అంటూ చాహల్ పేర్కొన్నారు. పుకార్లకు సంబంధించి తన కుటుంబానికి బాధ కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.