తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

ఇప్పటికే అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం కావడంతో, ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి ఈవెంట్ తేదీని ఖరారు చేశారు.
జనవరి 4న రాజమండ్రిలో ఈ వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌ను దిల్ రాజు ఆహ్వానించారు. ఇరువురి మధ్య సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై చర్చ జరిగింది.














