• Home
  • Movie
  • కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు: గోవాలో అంగరంగ వైభవంగా వివాహం
Image

కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు: గోవాలో అంగరంగ వైభవంగా వివాహం

మహానటి కీర్తి సురేష్ గారికి ఇటీవలే పెళ్లి జరిగింది. గత పది సంవత్సరాలుగా తన రహస్య ప్రేమికుడు ఆంటోనితో కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారు. ఈ విషయం ఎవరూ గుర్తించలేదు. కానీ గత నెలలో కీర్తి సురేష్ తన ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. పెళ్లికి ముందు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు.

కీర్తి సురేష్ మరియు ఆంటోనీ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తున్నాయి.

ప్రస్తుతం కీర్తి సురేష్ బేబీ జాన్ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, పెళ్లి పనుల వల్ల ఆమె ప్రమోషన్లలో ఎక్కువగా పాల్గొనడం లేదు. ఇప్పుడు కొన్ని రోజులు తన సమయాన్ని పూర్తిగా కుటుంబానికి కేటాయిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ వివాహ వేడుక కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. కొన్ని మంది సన్నిహితులను మాత్రమే గోవాకు ఆహ్వానించారు. అక్కడ కేరళ సంప్రదాయంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగినట్లు సమాచారం.

పెళ్లి విశేషాల గురించి పెద్దగా బయటకు రావడం లేదు. గోవాకు వెళ్తున్నానని, పెళ్లి పనులు మొదలయ్యాయని మూడు నాలుగు రోజుల క్రితం కీర్తి సురేష్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఆ పోస్ట్‌తోనే ఆమె వివాహ వేడుక గురించి ఎక్కువ సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పెళ్లి ఫోటోలు విపరీతంగా పాపులర్ అవుతున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్ ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. “దసరా” బ్లాక్ బస్టర్ తరువాత, “భోళా శంకర్” డిజాస్టర్ అయ్యింది. “రఘు తాత” చిత్రంతో మళ్లీ సందడి చేశారు. ఆ తరువాత “కల్కి 2898 ఏ.డి” చిత్రంలో బుజ్జి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే పెళ్లి తరువాత ఇదే వేగంతో కొనసాగుతారో, లేదో వేచి చూడాలి.

Releated Posts

మహేష్ బాబు చేయాల్సిన సినిమా దక్కించుకున్న రామ్ చరణ్…!!

సినీ పరిశ్రమలో ఒక కథ మరో హీరోకి వెళ్ళడం సాధారణమే. కానీ కొన్నిసార్లు అది ఒకరి కెరీర్‌ను మలుపు తిప్పే విధంగా మారిపోతుంది. అలాంటి…

ByByVedika TeamApr 19, 2025

షైన్ టామ్ చాకో అరెస్ట్ – డ్రగ్ కేసులో కీలక మలుపు..!!

ప్రముఖ నటుడు మరియు ‘దసరా’ విలన్‌ షైన్ టామ్ చాకో ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. రెండు రోజులుగా హోటల్ నుంచి తప్పించుకుని…

ByByVedika TeamApr 19, 2025

కేఎల్ రాహుల్ కుమార్తెకు నామకరణం: “ఇవారా” అర్థం ఏమిటి?

భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 24న వీరిద్దరికీ ఓ…

ByByVedika TeamApr 18, 2025

మ్యాడ్ స్క్వేర్ థియేటర్ హిట్‌ తర్వాత ఓటీటీలోకి..??

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో మ్యాడ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించిన ఈ యువతరానికి…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply