Vedika Media

Vedika Media

vedika logo

కంట త‌డిపెట్టించే ఆర్ నారాయ‌ణ‌మూర్తి ల‌వ్ స్టోరీ

న‌టుడు ఆర్ నారాయ‌ణ‌మూర్తి గురించి తెలియ‌న‌వారెవ‌రూ ఉండరు. ఈయ‌న బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల హీరోగా పేరొందారు. ఇటీవ‌ల ఆయ‌న ఒక‌ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ న‌టుడు ఆర్ నారాయ‌ణ‌మూర్తి గురించి తెలియ‌న‌వారెవ‌రూ ఉండరు. ఈయ‌న బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల హీరోగా పేరొందారు. నారాయణమూర్తి మాట్లాడుతూ.. తన ప్రేమ కథ చెప్పారు. మీరు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారా.? అన్న ప్రశ్నకు నారాయణమూర్తి ఆన్సర్ ఇస్తూ..” ప్రేమించాను.. కానీ అది విఫలం కాలేదు. ఆ అమ్మాయి నన్ను మనస్పూర్తిగా అభిమానించింది. నేను కూడా ఆమెను మనస్పూర్తిగా అభిమానించా.. అయితే ఓ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను వాళ్ళ పేరెంట్స్ కు పరిచయడానికి రమ్మంటే వెళ్ళాను. మొదటిసారి ఆమె ఇంటికి వెళ్ళాను.

వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు. నా జీవనవిధానం వేరు.. వాళ్ళ జీవనవిధానం వేరు. అప్పుడు అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసా.. నాది ఫ్లాట్ ఫారం బ్రతుకు.. ఆమె చాలా డబ్బున్న అమ్మాయి. నా భార్యను నేను మంచిగా చూసుకోవాలి. నాలా ఫ్లాట్ ఫారం మీద పెట్టకూడదు. నా కోరిక సినిమాల్లో చేయడం. నాకు అవకాశాలు వస్తాయో.. రావో.. ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. ఎందుకు.? ఇప్పుడు పెళ్లి చేసుకొని. ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని ఆమె జీవితాంతం నయరకయాతన పడటం అని.. ఆమెకు వివరంగా చెప్పి.. నన్ను అపార్ధం చేసుకోకండి.. మీరు వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. నేను మద్రాసు వెళ్లిపోతున్నా.. మళ్లీ ఉత్తరాలు రాసుకోవడం వంటివి వద్దు. మీరు పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశా .. అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చింది. నేను కూడా ఏడ్చాను. ఆతర్వాత ఆమెతో టచ్ లో లేను. ఆమె ఎక్కడో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. ఆమెను చూడాలనిపిస్తుంది.. మళ్ళీ వెళ్లి ఆమెను చూసి నేను బాధపడాలి ఎందుకు అని వదిలేశా.. అని అన్నారు ఆర్. నారాయణమూర్తి. నిజంగా ఎంత గొప్ప ప్రేమకథ కదా.. ! ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండాలని .. తనను పెళ్లిచేసుకొని జీవితం నాశనం చేసుకోకూడదు అని ఆ ప్రేమనే త్యాగం చేశారు నారాయణమూర్తి.

Leave a Comment

Vedika Media